Sunday, 29 June 2014

6000 కానిస్టేబుళ్లు, 500 ఎస్సైల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ!

Posted by Unknown


త్వరలో పోలీస్‌శాఖలో కొలువుల మేళాకు తెరలేవనుంది. ప్రపంచస్థాయి పోలీసింగ్‌పై దష్టిపెట్టిన పోలీస్‌శాఖ సిబ్బంది లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరువేలమంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైల నియామకానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో పోలీసింగ్‌ను పటిష్టపరచడానికి తగినంతగా సిబ్బంది నియామకం అత్యవసరం. పైగా రాష్ట్ర రాజధానిలో ప్రపంచస్థాయి పోలీస్ వ్యవస్థ నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో సిబ్బంది కొరతను అధిగమించడానికి హోంగార్డు స్థాయి నుంచి ఎస్‌ఐ వరకు నియామకాలు జరుపాలని ప్రభుత్వం దఢనిశ్చయంతో ఉందని పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. 
మొదటి దశలో భారీగా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నియామక ప్రక్రియ కావడంతో భారీస్థాయిలో ఖాళీలను భర్తీ చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. డీజీపీ ఈ మేరకు వివిధ విభాగాలు, జిల్లాల ఎస్పీల నుంచి ఖాళీలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 6వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైల నియామకం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అలాగే హోంగార్డుల నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయానికి రానుంది. దీంతో మొత్తం నియామకాలను ఒకేసారి జరుపాలని పోలీస్‌శాఖ భావిస్తున్నట్టు తెలిసింది. 
డ్రైవర్ల నియామకానికి పచ్చజెండా
పోలీస్‌శాఖలో డ్రైవర్ల నియామకం అంటూ ప్రత్యేకంగా లేదు. కేవలం ఉన్నతాధికారులకు అడపాదడపా మాత్రమే డ్రైవర్లను నియమించారు. పెట్రోలింగ్ వ్యవస్థ, పోలీస్ స్టేషన్లు.. ఇలా ప్రతి విభాగంతోపాటు త్వరలో అందుబాటులోకి రాబోతున్న పెట్రోలింగ్ ఇన్నోవా వాహనాలకు డ్రైవర్ల కొరత ఉందని సీఎం కేసీఆర్ దష్టికి డీజీపీ తీసుకెళ్లారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి 3,260 మంది డ్రైవర్లను నియమించుకునేందుకు పచ్చజెండా ఊపినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. డ్రైవర్ల నియామకం వల్ల ఇప్పుడు వాహనాలు నడుపుతున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు వారి వారి విధుల్లో చేరనున్నారు. దీంతో సిబ్బంది లోటు కూడా తగ్గే అవకాశముంది. 
సిబ్బంది సమస్య తీరితేనే…
సిబ్బంది నియామకం పూర్తయితే పోలీస్‌శాఖ పెద్ద సమస్య నుంచి గట్టెక్కినట్టు అవుతుంది. ప్రసుత్తం అన్ని ఉన్నా తగినంతగా సిబ్బంది లేకపోవడంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సమస్యలెదురవుతున్నాయి. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, ఎస్‌ఐల నియామకాలతో హైదరాబాద్, సైబరాబాద్‌లో మెరుగైన పోలీసింగ్ అందించడం సులభతరమవుతుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రైమ్ కంట్రోల్, ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఇలా ప్రతి విభాగంలో పోలీస్‌శాఖ తన విధులను సమర్థంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
[నమస్తే తెలంగాణా] సౌజన్యంతో

Tags:SI Notification 2014, Telangana Police Notification 2014, Telangana constable and SI notification
Read More
This is a Sticky post

This will appear right below the first post. You can edit this right from the template and change it to your own post. This will appear right below the first post. You can edit this right from the template and change it to your own post.This will appear right below the first post. You can edit this right from the template and change it to your own post.